రియల్ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌దే అగ్రస్థానం

రవీంద్రభారతి, డిసెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. డ్రీమ్ రియా ల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో రియల్ ఎస్టేట్ అవార్డు 2021 ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న వారు ఎప్పటికీ నష్టపోరని అన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే భూములపై పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. అనంతరం మాజీ ఎంపీ మురళీమోహన్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2021 రియల్ ఎస్టేట్ అవార్డును అందజేశారు. అలాగే ఎస్ఎస్ రాజుకు యంగ్ అచీవర్ రియ ల్ ఎస్టేట్ అవార్డుతో పాటు మరో పదిమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి. సతీశ్‌కుమార్, ఎన్. శేషుకుమారి, ఆర్. స్వామినాయుడు, వి.ఆర్. మగులూరి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

