హైదరాబాద్: జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జెంటిల్మెన్ అయిన మీతో పాటు రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత క్రికెట్ మరింత గొప్పగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకముందని అంటూ కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. టీమ్ఇండియా చీఫ్‌కోచ్‌గా ద్రవిడ్ నియామకంతో ఖాళీ అయిన స్థానాన్ని.. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌తో భర్తీ చేశారు. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో వీవీఎస్ సోమవారం విధుల్లో చేరాడు.