
ఎల్బీనగర్, డిసెంబర్ 20: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావుపై అభిమానంతో ఓ యువకుడు ఏకంగా 780 కిలోమీటర్లు నడిచాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన శేఖర్ తన ఊరు నుంచి హైదరాబాద్ వరకు కాలినడకన వచ్చాడు. గత నెల 30న బయలుదేరిన ఆ యువకుడు ఈ నెల 19న నగరానికి చేరుకొన్నాడు. అతడిని ఓ కార్యక్రమంలో కలిసిన కేటీఆర్.. ‘నాపై అభిమానంతో అంతదూరం నుంచి నడిచివచ్చావా?’ అని పలుకరించారు. రెండు రోజుల్లో ప్రగతిభవన్‌కు రావాలని చెప్పారు. దీంతో శేఖర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.