హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ) : సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుం డా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలు, ముఖ్యంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్య లు తీసుకోవాలని సూచించారు. ట్రాఫి క్ ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయ భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. విగ్రహ ఆవిషరణ కా ర్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించినట్టు మంత్రి తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ): సెక్రటేరియట్ వద్ద ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రానివారిని మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ వ్యతిరేకుల నడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆక్షేపించారు. అసలు అక్కడ ఏర్పాటు చేస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. అనేకమంది ఉద్యమకారుల మరణానికి కారణమైన కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ తల్లి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను తీసేసి తెలంగాణ సంస్కృతిని అవమానించారని మండిపడ్డారు.