IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండో విజయంపై కన్నేశాయి ముంబై ఇండియన్స్(Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants). లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, సొంత మైదానంలో లక్నో జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగనుంది. పేసర్ ఆకాశ్ దీప్ స్క్వాడ్‌లో చేరడంలో ఆ జట్టు బౌలింగ్ యూనిట్ బలోపేతంగా కనిపిస్తోంది.
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్, విల్ జాక్స్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, రాజ్ బవ, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విగ్నేశ్ పుతూర్.
🚨 Toss 🚨
Mumbai Indians won the toss and opted to bowl first against Lucknow Super Giants.
Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL | @mipaltan pic.twitter.com/sMnXPV2Xnx
— IndianPremierLeague (@IPL) April 4, 2025
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదొని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేశ్ సింగ్ రథీ, శార్థూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్.
గత రికార్డులు చూస్తే.. ముంబైపై లక్నోదే పై చేయి. ఇప్పటివరకూ రెండు జట్లు 6 సార్లు ఎదురుపడగా 5 పర్యాయాలు లక్నో జయకేతనం ఎగురవేసింది. అయితే.. వాంఖడేలో విజయంతో పాయింట్ల ఖాతాలో బోణీ కొట్టిన హార్దిక్ పాండ్యా సేన.. అదే జోరు కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. స్లో పిచ్, పెద్ద బౌండరీలు ఉండే ఈ మైదానంలో లక్ష్యం 200లోపే ఉంటుందని క్యురేటర్లు చెబుతున్నారు.