వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభంకావాల్సి ఉన్న క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్ (CSA T20 League)లో భాగంగా కేప్‌టౌన్ ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీకి ఎంఐ కేప్‌టౌన్ (MI Capetown) అని పేరు పెట్టింది. తాజాగా ఆ జట్టు తరఫున ఆడబోయే ఆటగాళ్లను పరిచయం చేసింది.
కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహించబోయే ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ఎంఐ కేప్‌టౌన్ తాజాగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ (అన్ క్యాప్డ్), కగిసొ రబాడా లతో పాటు ముగ్గురు విదేశీ ఆటగాళ్లను కూడా తీసుకుంది. ముగ్గురిలో సామ్ కరన్, లియామ్ లివింగ్ స్టోన్ ఇంగ్లండ్ ఆటగాళ్లే కాగా ఐదో ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను తీసుకుంది.
పైన పేర్కొన్న ఐదుగురిలో డెవాల్డ్ బ్రెవిస్ ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నవాడే. అతడిప్పుడు కేప్‌టౌన్ ఫ్రాంచైజీలో కూడా భాగం కానున్నాడు. ఇక లివింగ్‌స్టోన్ స్పిన్ ఆల్ రౌండర్ కాగా కరన్ బౌలింగ్ ఆల్ రౌండర్. రబాడా, రషీద్ ఖాన్లు అగ్రశ్రేణి బౌలర్లైనా బ్యాటింగ్ చేయగల సత్తా వాళ్లకు ఉంది.
Let’s rock with @KagisoRabada25! 🌈💙🇿🇦
.#OneFamily #MIcapetown @OfficialCSA pic.twitter.com/w1qRSR98H5— MI Cape Town (@MICapeTown) August 11, 2022