HDI | న్యూఢిల్లీ, జనవరి 22: ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్ద కాలంలో మహిళల కంటే పురుషులు రెండు రెట్లు వేగంగా ఎత్తు, బరువు పెరిగారని, ఇది మహిళలు, పురుషుల మధ్య భారీ వ్యత్యాసాలకు దారితీసిందని నూతన అధ్యయనం వెల్లడించింది.
రోహాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లూయిస్ హాల్సే నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు బ్రిటన్ లాంటి పలు దేశాల రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకుని పురుషులు, మహిళల ఎత్తు, బరువులో వచ్చిన మార్పులను గమనించామని, ఆ వివరాలను మానవ అభివృద్ధి సూచీ (హెచ్డీఐ) కొలిచిన జీవన ప్రమాణాలతో పోల్చిచూశామని హాల్సే తెలిపారు.