మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన డొమినికా కోర్టు
మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన డొమినికా కోర్టు | పీఎన్బీ కుంభకోణం కేసులో డొమినికా పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ చోక్సీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.

న్యూఢిల్లీ : పీఎన్బీ కుంభకోణం కేసులో డొమినికా పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ చోక్సీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టుకు చోక్సీ చక్రాల కుర్చీపై హాజరయ్యారు. అంతకు ముందు ఆంటిగ్వా నుంచి డొమినికాలో అక్రమంగా ఎందుకు ప్రవేశించారో చెప్పాలని కోర్టు ఆదేశించగా.. వ్యక్తిగతంగా కోర్టుకు చోక్సీ వచ్చారు. మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ.. కొద్దిరోజుల తర్వాత డొమినికాలో ప్రత్యక్షమయ్యారు.
అయితే, చోక్సీని ఎవరో అపహరించి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలుపగా.. అక్రమంగానే ప్రవేశించారని అక్కడి పోలీసులు వాదించారు. భారత్‌లో 11 నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున.. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు అతని తరఫు న్యాయవాది తెలిపారు.
డొమినికాలో మెహుల్ చోక్సీ సోదరుడు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీని డొమినికా నుంచి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు అడ్డుకునేందకు అతని సోదరుడు చేతన్ చోక్సీ రంగంలోకి దిగి.. అక్కడి ప్రతిపక్ష నేతతో కుమ్మక్కైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు వార్తలు వినవస్తున్నాయి.
మెహుల్ చోక్సీని భారత్‌కు పంపడానికి సంబంధించి కోర్టులో విచారణ జరగడానికి ముందే చేతన్ చోక్సీ హాంకాంగ్ నుంచి నేరుగా భారీ మొత్తంతో డొమినికాలో వాలిపోయాడని, ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్‌కు 2 లక్షల డాలర్లు ముట్టజెప్పాడని అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. విచారణ సందర్భంగా.. చోక్సీ సోదరుడు చేతన్ చోక్సీతో పాటు డొమినికా విపక్ష పార్టీకి చెందిన లెన్నాక్స్ లింటన్ కోర్టులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మెహుల్ చోక్సీని అపహరించారనే వాదనను పార్లమెంట్లో బలంగా వినిపించాలని, తద్వారా రానున్న ఎన్నికల్లో భారీగా నిధులు సమకూరుస్తామని లింటన్‌కు చేతన్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు గదిలో ఆయన కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానిపై ఎఫ్ఐఆర్
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్లో బీజేపీ కౌన్సిలర్ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

