మేఘా విలువ రూ.లక్ష కోట్లు!
దేశీయ మౌలిక సదుపాయాల కల్పన రంగంలో దూసుకుపోతున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ విలువను ఓ సంస్థాగత లావాదేవీల్లో భాగంగా దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
- గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.7,000 కోట్ల సమీకరణ
- పీవీ కృష్ణారెడ్డి చేతికి పీపీ రెడ్డి వాటా?
హైదరాబాద్, నవంబర్ 18: దేశీయ మౌలిక సదుపాయాల కల్పన రంగంలో దూసుకుపోతున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ విలువను ఓ సంస్థాగత లావాదేవీల్లో భాగంగా దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ క్రమంలోనే కంపెనీ అనుబంధ విభాగం ఈపీటీఎల్ వాల్యూ రూ.14,000 కోట్లుగా తేలింది.
కాగా, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులుగా పేరొందిన డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్, వర్డే పార్ట్నర్స్, హిల్‌హౌస్ క్యాపిటల్ ఈ డీల్‌లో భాగమయ్యాయి. ఈ కన్సార్టియం నుంచి సుమారు రూ.7,000 కోట్ల నిధులను (700 మిలియన్ డాలర్లు) మేఘా ఎండీ పీవీ కృష్ణారెడ్డి అందుకున్నట్టు సమాచారం.
పీపీ రెడ్డి వాటా కొనుగోలుకు..
గత ఏడాది జరిగిన కుటుంబ లావాదేవీల సెటిల్మెంట్లో భాగంగా ఎంఈఐఎల్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీపీ రెడ్డి (పమిరెడ్డి పిచ్చిరెడ్డి) వాటాను పీవీ కృష్ణారెడ్డి కొనబోతున్నారని సంబంధిత వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే సదరు గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి నిధులను కృష్ణారెడ్డి సమీకరించినట్టు చెప్తున్నారు. ఎప్పట్నుంచో ఈ డీల్ కోసం ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు ఓకే అయినట్టు తెలుస్తున్నది. కాగా, గతంలో మేఘాలో పీవీ కృష్ణారెడ్డికి 49 శాతం వాటానే ఉండేది. పీపీ రెడ్డికి 51 శాతం వాటా ఉన్నది. కానీ ఆ తర్వాత పీవీ కృష్ణారెడ్డి వాటా 57 శాతానికి పెరిగింది. తాజా లావాదేవీల నేపథ్యంలో కంపెనీలో పీపీ రెడ్డికి ఉన్న మొత్తం వాటాను పీవీ కృష్ణారెడ్డి దక్కించుకోబోతున్నట్టు తెలుస్తున్నది.
3 దశాబ్దాలకు పైగా..
1989లో హైదరాబాద్ కేంద్రంగా రూ.5 లక్షల పెట్టుబడితో మేఘా ఇంజినీరింగ్‌ను పీపీ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత పీవీ కృష్ణారెడ్డి కంపెనీలో భాగమవగా.. 2006లో వ్యాపారం పేరు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌గా మా రింది. తెలంగాణ ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు జోజిలా సొరంగం పనులు, మరెన్నో సంస్థ చేపట్టినవే. రాష్ట్రంలో, దేశంలోనేగాక 20కి పైగా దేశాల్లోనూ కంపెనీ ప్రాజెక్టులుండటం విశేషం. 2024-25లో కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.42,669 కోట్లుగా ఉన్నది. నికర లాభం రూ.3,072 కోట్లుగా నమోదైంది. నీటిపారుదల, నిర్మాణ, రోడ్డు రవాణా, ఇంధనం, విద్యుత్తు వాహనాల తయారీ తదితర రంగాల్లో మేఘా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇక ఫోర్బ్స్ ప్రకటించే దేశంలోని సంపన్న వర్గాల జాబితాలో పీవీ కృష్ణారెడ్డి, పీపీ రెడ్డి పేర్లూ ఉంటాయన్నది తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

