వాహ్.. వాయేజర్!
అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమనౌక భూమి నుంచి ఒక కాంతి రోజు దూరాన్ని చేరుకుంది. 1977 సెప్టెంబర్ 5న ప్రయాణం ప్రారంభించిన ఈ వ్యోమనౌక 2026, నవంబర్ 18 నాటికి సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించింది.
- భూమికి ఒక కాంతి రోజు దూరానికి చేరిన వాయేజర్-1
- 49 ఏండ్ల ప్రయాణం.. అంతరిక్షంలో సరికొత్త రికార్డు
వాషింగ్టన్ : అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమనౌక భూమి నుంచి ఒక కాంతి రోజు దూరాన్ని చేరుకుంది. 1977 సెప్టెంబర్ 5న ప్రయాణం ప్రారంభించిన ఈ వ్యోమనౌక 2026, నవంబర్ 18 నాటికి సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించింది. కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరాన్ని ‘కాంతి రోజు’ అంటారు. కాంతి వేగం సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఈ లెక్కన 24 గంటల్లో 25.9 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వాయేజర్-1 గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తున్నది. భూమి నుంచి పంపే ఆదేశం వాయేజర్-1కు చేరడానికి 24 గంటలు పడుతుంది.
అక్కడి నుంచి పంపే సమాచారం తిరిగి భూమికి రావడానికి మరో 24 గంటలు పడుతుంది. అంటే ఒక ఆదేశానికి సంబంధించిన ప్రతిస్పందన తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు దాదాపు రెండు రోజులు వేచి చూడాలి. తొలుత బృహస్పతి, శని గ్రహాలను అధ్యయనం చేసేందుకు రూపొందించిన వాయేజర్-1 గతంలో 1979లో బృహస్పతిని, 1980లో శనిని పరిశీలించింది. 2012 ఆగస్టులో సూర్యుడి ప్రభావ పరిధిని దాటి అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది. ఫ్లూటోనియం-238 రేడియోధార్మిక క్షయం ద్వారా ఉత్పత్తయ్యే శక్తితో ఇది పనిచేస్తుంది.
కాలక్రమేణా విద్యుత్ తగ్గుతుండటంతో నాసా కొన్ని పరికరాలను నిలిపివేసి, కీలక వ్యవస్థలను కొనసాగిస్తున్నది. 1970 నాటి కంప్యూటర్లతో ఇంత దూరం నుంచి వ్యోమనౌకను నిర్వహించడం సవాలుగా మారింది. వాయేజర్-1లో గోల్డెన్ రికార్డ్ పేరుతో బంగారు పూత పూసిన రాగి డిస్క్‌ను పంపించారు. ఇందులో భూమిపై ఉండే జీవజాలం, ప్రకృతి శబ్ధాలు, సంగీతం, చిత్రాలు, వివిధ భాషల్లో సందేశాలు ఉన్నాయి. గ్రహాంతర నాగరికతలకు భూమిని గురించి తెలియజేయడం దీని ఉద్దేశం. దాదాపు అర్ధ శతాబ్దంగా కొనసాగుతున్న ఈ ప్రయాణం మానవ సాంకేతికత పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

