Mega Family | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘ఓజీ’ థియేటర్లలో దుమ్మురేపుతోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతూ, ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్షన్, థమన్ సంగీతం, స్టైలిష్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ హిట్‌ను సెలబ్రేట్ చేసుకునేలా, సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మెగా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా ‘ఓజీ’ స్పెషల్ షో ను ఏర్పాటు చేశారు.
ఈ స్క్రీనింగ్‌కి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య, అలాగే చిరంజీవి మనవరాళ్లు హాజరయ్యారు. మొత్తానికి మెగా కుటుంబం ఒక్కచోట చేరి సినిమాను ఎంజాయ్ చేసింది. ఇక ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సినిమా యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. డైరెక్టర్ సుజీత్, హీరో అడివి శేష్, నటుడు-రచయిత రాహుల్ రవీంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ‘ఓజీ’ను వీక్షించారు. సినిమా ముగిసిన తర్వాత చిరంజీవి, రామ్ చరణ్‌లు సినిమా టీమ్‌ను అభినందించగా, ఆ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా హాల్ నుంచి బయటకు వస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానుల్లో హర్షం నింపింది. ప్రత్యేకించి చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ‘ఓజీ’ ఇప్పటికే మంచి రివ్యూలను సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కలిసి చూసిన ఈ స్పెషల్ షో మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. అభిమానులు ఈ చిత్రాన్ని కేవలం సినిమా కాకుండా, మెగా ఫ్యామిలీ ఉత్సవంలా భావిస్తున్నారు.
Exclusive Visuals From #OG Special Show…
మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇది బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు. ఫ్యామిలీ అంతా ఇలా కలిసి సినిమా చూడటం.#MegaFamily #TheyCallHimOG pic.twitter.com/RzGxi4U38Z
— Rajesh Manne (@rajeshmanne1) September 29, 2025