మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో టాప్ సీడ్ డానియల్ మెద్వెదెవ్ (రష్యా) జోరు కనబరుస్తున్నాడు. గతేడాది ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓడిన మెద్వెదెవ్ ఈసారి తిరుగులేని ప్రదర్శనతో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో మెద్వెదెవ్ 6-4, 6-4, 6-2తో వాన్ డె జాండ్స్కల్ప్పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో స్వియాటెక్, సబలెంక, హలెప్, విజయాలు సాధించారు. శనివారం జరిగిన మూడో రౌండ్లో ఏడో సీడ్ స్వియాటెక్ 6-2, 6-3తో కాస్ట్కినాపై నెగ్గా.. సబలెంక్ 4-6, 6-3, 6-1తో వోండ్రుసోవాను చిత్తు చేసింది. నేడు జరుగనున్న మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్ పోరులో భారత స్టార్ సానియా మీర్జా- రాజీవ్ రామ్ (అమెరికా) ద్వయం బరిలోకి దిగనుంది.