Sonam Wangchuk | నన్ను ఎన్కౌంటర్లో చంపేస్తారేమో.. సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళన
Sonam Wangchuk : తనను ఎన్కౌంటర్లో చంపేస్తారేమో అని ప్రముఖ పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. లదాఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గత ఏడాది స్థానికులు లేహ్‌లో ఆందోళన నిర్వహించారు.
Sonam Wangchuk : తనను ఎన్కౌంటర్లో చంపేస్తారేమో అని ప్రముఖ పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. లదాఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గత ఏడాది స్థానికులు లేహ్‌లో ఆందోళన నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్ 24న ఈ ఆందోళన నిర్వహించగా.. ఇది హింసకు దారితీసింది. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలో నలుగురు మరణించారు. భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం పదుల సంఖ్యలో పౌరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం వాంగ్‌చుక్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన సందర్బంగా హిందువులకు, బౌద్ధులకు మధ్య గొడవలు సృష్టించేందుకు, ఈ ప్రాంతలో హింసను ప్రేరేపించేందుకు కుట్రలు జరిగాయని సోనమ్ వాంగ్‌చుక్ ఆరోపించారు. నేను ఈ రోజు ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత నన్ను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
గతంలో కూడా ఇలాగే చేశారు. నన్ను జైలుకు పంపారు. ఇప్పుడు మిగిలింది నన్ను ఎన్కౌంటర్ చేయడమే. నన్ను ఎన్కౌంటర్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా ఎన్కౌంటర్ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నా ఎన్‌కౌంటర్‌తో దేశం మేల్కొంటుందని భావిస్తున్నా అంటూ వాంగ్‌చుక్ అన్నారు. లదాఖ్‌లో గురువారం వందలమంది గుమిగూడారు. గత ఏడాది హింస సందర్భంగా మరణించిన వారికి నివాళి అర్పించారు. ఈ ప్రాంతంలో హింసకు కుట్ర జరిగిందని స్థానిక ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి సూచనలు లేకుండానే గత ఏడాది భద్రతా బలగాలు కాల్పులు జరిపారని వారు విమర్శిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

