హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చేసిన మార్గదర్శకాలను జూన్10లోగా అమలు చేయాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జ్యుడిషియరీ ఎంక్వయిరీ కమిషన్ స్పష్టం చేసింది. వర్షాకాలంలో బరాజ్‌ల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు బరాజ్‌ల నిర్మాణ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మార్గదర్శకాల మేరకు చేపట్టాల్సిన పనులపై చర్చించారు. జాప్యం లేకుండా పనులు చేపట్టాలని ఆయా ఏజెన్సీలను కోరినట్టు సమాచారం.