సెప్సిస్, రక్తస్రావమే మృతికి కారణం
తీవ్రమైన సెప్సిస్, తీవ్రమైన రక్తస్రావంతోనే ఇటీవల తమ దవాఖానలో మహిళా యువ న్యాయవాది మృతి సంభవించిందని సికింద్రాబాద్ మెడికవర్ దవాఖాన యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఈ మేరకు స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపాలని కోరుతూ డీజీపీకి వినతిపత్రం అందజేయనున్నట్టు ప్రకటించింది.
- యువ న్యాయవాది మృతి ఘటనపై మెడికవర్ యాజమాన్యం వివరణ
మారేడ్‌పల్లి, అక్టోబర్ 22: తీవ్రమైన సెప్సిస్, తీవ్రమైన రక్తస్రావంతోనే ఇటీవల తమ దవాఖానలో మహిళా యువ న్యాయవాది మృతి సంభవించిందని సికింద్రాబాద్ మెడికవర్ దవాఖాన యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఈ మేరకు స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపాలని కోరుతూ డీజీపీకి వినతిపత్రం అందజేయనున్నట్టు ప్రకటించింది.
గురువారం దవాఖానలో మీడియాతో మెడికవర్ దవాఖాన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, వైద్య నిపుణులు ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ యువతి బయట డయాగ్నొస్టిక్ కేంద్రంలో చేయించుకున్న సీటీ స్కాన్ నివేదిక ప్రకారం ఆమె కిడ్నీలో సుమారు 16:17:20 మిల్లీమీటర్ల పరిమాణంలో రాయి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం రోగిని వెంటిలేషన్ ట్యూబ్ నుంచి తొలగించినప్పుడు స్పృహలోనే ఉన్నారని, అనంతరం సర్జికల్ ఐసీయూకు తరలించామని తెలిపారు. తర్వాత ఆమెకు తీవ్రమైన సెప్సిస్‌తోపాటు ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో మెదడులో తీవ్ర రక్తస్రావం సంభవించిందని, వైద్యబృందం ప్రయత్నాలు ఫలించకపోవడంతో రోగిని కాపాడలేకపోయామని వివరించారు.
‘2011లో సహృదయ హెల్త్‌కేర్ స్థాపన’
మెడికవర్ దవాఖానల యజమాన్యం నిర్మాణంపై వస్తున్న ఆరోపణలపైనా చైర్మన్, వైద్యులు వివరణ ఇచ్చారు. సహృదయ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ 2011 జనవరిలోనే స్థాపించినట్టు తెలిపారు. మెడికవర్ ఏబీ 2017 నుంచి పెట్టుబడులు పెట్టిందని, ప్రస్తుతం ఆ సంస్థకు 66.1 శాతం వాటా ఉన్నదని, 2017 నుంచి కొత్త షేర్ల కేటాయింపు జరుగలేదని పేర్కొన్నది. సంస్థపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం చర్యలు చేపడుతామని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

