మంత్రి జూపల్లిని విమర్శించారని..
సోషల్ మీడియాలో మంత్రి జూపల్లిని విమర్శించారని ఓ యువకుడిని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం 7 నుంచి, రాత్రి ఏడు గంటల దాకా చిత్రహింసలకు గురిచేసిన ఘటన చోటుచేసుకున్నది.
- యువకుడిని చితకబాదిన ఎస్సై
మహబూబ్‌నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సోషల్ మీడియాలో మంత్రి జూపల్లిని విమర్శించారని ఓ యువకుడిని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం 7 నుంచి, రాత్రి ఏడు గంటల దాకా చిత్రహింసలకు గురిచేసిన ఘటన చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మండ్ల రాఘవ బుధవారం రాత్రి గ్రామానికి చెందిన సోషల్ మీడియా గ్రూపులో మంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించాడు అనే కారణంతో పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తూ పోస్టులను పెడుతావా అంటూ చితకబాదారు. పోలీసుల దాడిలో రెండు చేతులు, అరికాళ్లలో రక్తం గడ్డకట్టి తీవ్ర నొప్పులతో బాధపడుతున్నట్టు బాధిత యువకుడు తెలిపారు. తప్పు చేసి ఉంటే కేసు పెట్టి కోర్టుకు పంపించాలి కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని విచక్షణారహితంగా హింసించడం ఏమిటని.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

