Kerala | కొచ్చి: మీడియా సంస్థలు సంయమనం పాటించాలని కేరళ హైకోర్టు చెప్పింది. దర్యాప్తులు, క్రిమినల్ కేసులపై విచారణ సమయంలో రిపోర్టింగ్ చేసేటపుడు దర్యాప్తు లేదా జ్యుడిషియల్ అధికారుల పాత్రను చేపట్టకుండా సంయమనం పాటించాలని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అనేవి ప్రాథమిక హక్కులు అని; నిందితుడి అపరాధం లేదా అమాయకత్వం గురించి చట్టబద్ధమైన అధికారులు ఓ నిర్ణయానికి రావడానికి ముందే, ఆ నిందితుడి అపరాధం లేదా నిర్దోషిత్వం గురించి ప్రకటించేందుకు ఈ హక్కులు మీడియాకు లైసెన్స్ కాదని వివరించింది.