ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
ధాన్యం విక్రయించుకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్‌కు చెందిన తిరుపతి కిషన్ (65) ఈ ప్రమాదంలో మృతిచెందారు.
మెదక్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ధాన్యం విక్రయించుకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్‌కు చెందిన తిరుపతి కిషన్ (65) ఈ ప్రమాదంలో మృతిచెందారు. గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల ద్వారా ధాన్యం అమ్ముకునేందుకు సిద్ధమైన ఆయన.. చివరకు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు.
తిరుపతి కిషన్ తన పొలంలో వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నారు. అయితే గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్ 3న రాత్రి 10.45 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఔరంగాబాద్ గేట్ వద్ద పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన కిషన్‌ను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన డ్యూటీ వైద్యుడు అందుబాటులో లేరని, కనీస విద్యుత్ సదుపాయం కూడా లేక వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురయ్యాయని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందుబాటులో ఉండి ఉంటే ఆయన ప్రాణాలు దక్కేవేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు కిషన్ మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
ప్రమాదానికి కారణమైన కారును సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ వైద్యుడు అందుబాటులో లేకపోవడం, విద్యుత్ సదుపాయం లేమిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక పరిహారం అందించి ఆదుకోవాలని, ఔరంగాబాద్, హవేలి, పరిసర గ్రామాల రైతుల కోసం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

