తూప్రాన్ పట్టణం అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. టీఆర్ఎస్ సర్కారు హయాంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూ.100 కోట్లతో అనేక పనులు పూర్తయ్యాయి.
రూ.25కోట్ల 20లక్షలతో 504 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తుండగా, త్వరలోనే లబ్ధిదారులకు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రూ.11కోట్లతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ భవనాలను నిర్మించారు. స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సదుపాయాలతో 50 పడకల దవాఖానను ఏర్పాటు చేశారు. పెండ్లిళ్ల కోసం రూ.కోటితో ఫంక్షన్ హాల్, రూ.22లక్షలతో రైతువేదిక భవనాన్ని నిర్మించారు. పట్టణానికే వన్నెతెచ్చేలా రూ.5కోట్ల 36లక్షలతో నిర్మించిన మున్సిపల్ భవనం, మినీఅసెంబ్లీని తలపిస్తున్నది. అలాగే, సీసీ డ్రైన్, సీసీ రోడ్లను అధికారులు పూర్తి చేశారు. ఇవే కాకుండా మరో 210 కోట్ల పనుల కోసం గడా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇలా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక తూప్రాన్ దశ తిరిగిందని ఆనంద పడుతున్నారు.
రామాయంపేట/తూప్రాన్, మార్చి 22 : తూప్రాన్ కేరాఫ్ కేసీఆర్.. కేసీఆర్ కేరాఫ్ తూప్రాన్ అన్న చందంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మునుపెన్నడూ లేని విధంగా గజ్వేల్ నియోజక వర్గానికి దీటుగా పనులు కొనసాగుతున్నాయి. తూప్రాన్ పట్టణ అభివృద్ధ్దే లక్ష్యంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక చొరవ, మరో పక్క మున్సిపల్ చైర్మన్ తూప్రాన్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. గజ్వేల్ నియోజక వర్గానికి దగ్గరగా ఉండడమే గాకుండా హైవేకు ఆనుకుని ఉన్న తూప్రాన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధ్దిలో ముందడుగు వేసేలా తయారు చేస్తున్నారు. ఇప్పటికే రూ. వంద కోట్ల్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. తూప్రాన్ పట్టణ వాసులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీఎం కేసీఆర్ నిధులతో సర్వాంగ సుందరంగా తయారు చేశారు. పట్టణంలోనే తూప్రాన్ పట్టణ ప్రజలే గాకుండా చుట్ట్టు పక్కల జిల్లాల ప్రజలు ఆకర్షించేలా తూప్రాన్ నడిబొడ్డున పురపాలక సంఘ భవనాన్ని నిర్మించారు.
అదొక మినీ అసెంబ్లీని తలపించేలా నిర్మించారు. తూప్రాన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మున్సిపల్ భవనం నిలుస్తుంది. గజ్వేల్ నియోజకవర్గ ఎమెల్యేగా, సీఎంగా కేసీఆర్ 2013 సంవత్సరం నుంచే ప్రత్యేకంగా ‘గడా’ అధికారితో ప్రణాళికలను తయారు చేయించి 2015 సంవత్సరంలోనే తూప్రాన్ పట్టణంలో అభివృద్ధి పనులను మొదలు పెట్టారు. పట్టణంలోని మూడు నర్సరీలను ఏర్పాటు చేశారు. నర్సరీల్లో ప్రస్తుతం లక్ష 20 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ మోహన్ తెలిపారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి ఇక ఎమ్మెల్యేగా ఎన్నికకావడం, తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే తూప్రాన్ పట్టణ దశ మారింది. గత దశాబ్దాలుగా బీడుగా ఉన్న భూములకు ప్రస్తుతం రెక్కలొచ్చాయి. అంతే గాకుండా గుంట భూమి కూడా ఖాళీ లేకుండా పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలంగా మారింది. ఇది మా కేసీఆర్ చలువేనంటున్నారు. తూప్రాన్ ప్రాంత రైతాంగం.
రూ.9 .40 కోట్లతో ..50 పడకల దవాఖాన
తూప్రాన్ పట్టణ, పరిసర గ్రామాల ప్రజల సౌకర్యార్థ్దం 2018 సంవత్సరంలోనే 50 పడకల దవాఖానను నిర్మించి ప్రమాదాలు జరిగినా, మరేదైనా అనారోగ్యానికి గురైనా సకల హంగులతో దవాఖానను నిర్మించి ప్రజలకు చేరువయ్యారు సీఎం కేసీఆర్. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఎప్పుడూ ఏదో ఒక దగ్గర ప్రమాదాలు జరిగేవి. ప్రమాదాల చికిత్సలకు హైదరాబాద్ వెళ్లకుండా పట్టణంలోనే అతిపెద్ద దవాఖాన నిర్మిం చి అన్ని రకాల వైద్యులను అందుబాటులో ఉండేలా చర్యలను చేపట్టారు.
రూ. 63 లక్షలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
2016 సంవత్సరంలోనే రూ.63లక్షలతో సీఎం కేసీఆర్ రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తూప్రాన్‌లోనే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మించి రైతులకు దగ్గరయ్యారు. గతంలో రిజిస్ట్రేషన్‌కు వెళ్లాలంటే గజ్వేల్‌కు వెళ్లాలి.. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు రైతులు పడవద్దనే ఉద్దేశంతో తూప్రాన్ లోనే కార్యాలయాన్ని నిర్మించారు.
రూ.5.36 కోట్లతో మున్సిపల్ భవనం
తూప్రాన్ పట్టణానికే అందాన్నిచ్చేలా రూ. 5.36కోట్లతో మినీ అసెంబ్లీని తలపెట్టేలా మున్సిపల్ భవనాన్ని నిర్మించారు. భవనం ఎదుట గార్డెన్ చూడచక్కగా ఉం టుంది. తూప్రాన్‌కు వచ్చిన వారి దృష్టి అంతా మున్సిపల్ భవనంపైనే ఉండేలా సకల హంగులతో నిర్మించారు.
రూ.8 కోట్లతో సీసీ ్రడ్రైన్లు, సీసీ రోడ్లు ..
తూప్రాన్ పట్టణంలోని రూ.8 కోట్లతో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లను నిర్మించారు. ప్రధానంగా ఎస్సీ కాలనీ ప్రజలు గత దశాబ్దాల కాలంగా మురుగు నీటితోనే సావాసం చేసేవారు. వారి కాలనీలోకి వెళ్లాలంటేనే కంపు కొట్టేది. రూ.30లక్షలతో సీసీ రోడ్డువేసి ఎస్సీ కాలనీ వాసులకు దుర్గంధం లేకుండా చేశారు. కాలనీలలో సీసీ రోడ్లు, సీసీ డ్రేన్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలిగించారు. ఇవే గాకుండా పట్టణంలోని డంపింగ్ యార్డుకు రూ. కోటి15లక్షలు, సెంట్రల్ లైటింగ్ సిస్టం రూ.25లక్షలు, పట్టణంలోని రోడ్డు మధ్యలో గార్డెన్ డివైడర్లకు రూ.40 లక్షలు, తూప్రాన్ నుంచి నర్సాపూర్ వెళ్లే దారిలో రూ.30 లక్షలతో ఐలాండ్ నిర్మాణాన్ని చేపట్టారు.
రూ.కోటితో వైకుంఠధామం, రూ12లక్షలతో వైకుంఠ రథం ప్రజల సౌకర్యార్థ్దం మరణించినవారి వారిమృతదేహాలను తీసుకెళ్లాలంటే ఎవ్వరి స్థలాల్లో వారు ఖననం చేసేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందు కోసం రూ. కోటితో సర్వాంగ సుందరంగా చివరి మజిలీని నిర్మిస్తున్నారు. సకల హంగులతో అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపడుతున్నారు. మృతదేహాలను తీసుకేళ్లడం కోసం రూ.12లక్షలతో వైకుంఠ రథాన్ని కూడా సిద్ధ్దం చేశారు. రూ.కోటితో ఫంక్షన్‌హాల్, రూ.22 లక్షలతో రైతువేదిక పట్టణంలో నిరుపేదల పెండ్లిండ్ల కోసం ప్రభుత్వం రూ. కోటి రూపాయలతో ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్నారు. రైతు సమావేశాలకు రూ.22లక్షలతో రైతువేదిక భవనాన్ని నిర్మించారు.
తూప్రాన్ పట్టణంలోని ప్రజల సౌకర్యార్థ్ధం వెజ్అండ్ నాన్ వెజ్ భవనాలను రూ.11కోట్లతో నిర్మించారు. తూప్రాన్ పట్టణంలో గత దశాబ్దాలుగా హైవే రోడ్డుపైనే మార్కెట్ ఉండేది. నేడు సీఎం కేసీఆర్ నిధులతో ప్రత్యేకంగా నర్సాపూర్ రోడ్డులో నిర్మించి ప్రజలకు సౌకర్యంగా ఉండేందు కోసం చూడచక్కగా తయారు చేశారు.
రూ.210 కోట్లతో ప్రతిపాదనలు
రూ.210 కోట్లతో పట్టణంలో మినీ స్టేడియం నిర్మాణం, ఆర్డీవో కార్యాల యం, డీఎస్పీ కార్యాల యం, అల్లాపూర్-మజీద్ వరకు బీటీ రోడ్డు, ఐవోసీ బిల్డింగ్, 16 వార్డుల్లో సీసీ రోడ్లు వివిధ అభివృద్ధి పనులకు గజ్వేల్ ‘గడా’ అధికారితో ప్రతిపాదనలు సిద్ధ్దం చేశారు.
రూ.3కోట్లతో బైపాస్ బీటీ రోడ్డు ..
రూ.3 కోట్లతో తూప్రాన్ పట్టణానికి ప్రజల వాహనాలు వచ్చేవిధంగా బీటీ రోడ్డును వేశారు. ప్రస్తుతం వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడకుండా తమ వాహనాలతో పట్టణానికి స్వేచ్ఛగా చేరుకుంటున్నారు.
మినీ ట్యాంక్‌బండ్‌గా పెద్ద చెరువు
రూ.20 కోట్లతో తూప్రాన్ పట్టణానికి ఆనుకుని ఉన్న పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధ్దం చేశారు.
రూ.25.20 కోట్లతో 504 డబుల్బెడ్రూం ఇండ్లు
తూప్రాన్ పట్టణంలోని రూ.25.20 కోట్లతో 504 రెండు పడకల గదులను నిర్మించారు. వాటి పనులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే అర్హులైన లబ్ధ్దిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇండ్ల్లులేని లబ్ధ్దిదారుడికే ఇండ్లు అందేలా చర్యలు చేపడ్తున్నారు.
మరో గజ్వేల్గా మారుస్తాం..
తూప్రాన్ పట్టణం ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రోద్భలంతో రూ. వంద కోట్లకు పైగా ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తయారు చేశాం. ఇంకా మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రజలు మెచ్చే పనులను చేస్తాం. ప్రజలను భాగస్తులను చేస్తాం. సీఎం కోటా నుంచి మరో రూ.210 కోట్లకు గడా అధికారి ద్వారా ప్రతిపాదనలు పంపాం. వాటి పనులు కూడా పూర్తి చేస్తాం.
-వంటేరు ప్రతాప్‌రెడ్డి,ఎఫ్డీసీ చైర్మన్
ప్రజల భాగస్వామ్యంతోనే పనులు..
ప్రజల భాగస్వామ్యంతో తూప్రాన్ పట్టణాన్ని మరింత అభివృద్ధ్ది చేస్తాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. తూప్రాన్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి కోట్లాది రూపాయలతో మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ నల్లాల ద్వారా తాగిస్తున్నాం. పారిశుధ్య కార్మికులతో ప్రతిరోజూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపడ్తున్నాం.
– బొంది రవీందర్‌గౌడ్,తూప్రాన్ మున్సిపల్ చైర్మన్
చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో..
తూప్రాన్ మున్సిపల్ చైర్మన్, 16 మంది కౌన్సిలర్ల సహకారంతో మున్సిపల్లో పనులను చేపట్టాం. మున్సిపల్ అభివృద్ధి కావాలనే పట్టుదల కౌన్సిలర్లకు, చైర్మన్‌కు ఉంది. అందుకే తూప్రాన్ మున్సిపల్ నేడు అభివృద్ధ్దిలో ముందున్నది. మరి న్ని అభివృద్ధి పనులకు కూడా ప్రతిపాదనలు పంపాం.
-మోహన్, మున్సిపల్ కమిషనర్