రామాయంపేట/మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం, మార్చి 14 : ఎండలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలను ఒంటిపూటకే పరిమితం చేసింది. విద్యార్థులు నేటి నుంచి ఉదయం 8గంటలకే పాఠశాలకు చేరుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నడిపించాలని సర్క్యులర్‌ను ప్రభుత్వ పాఠాశాలల హెచ్ఎంలకు పంపించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల చిన్నారులు ఉదయం పాఠశాలకు చేరుకుని మధ్యాహ్నం 12:30కి పాఠశాలలోనే మధ్యా హ్న భోజనం చేసి వెళ్లిపోవాలి. ఉన్నత పాఠశాలలకు మాత్రం పదో తరగతి విద్యార్థులు తమ సెలబస్ పూర్తి కానందు న పాఠశాలలోనే టీచర్లు ప్రత్యేక క్లాసులను తీసుకునేలా ఉత్తర్వులను జారీ చేసింది.
విద్యార్థు లు పాఠశాలలో ఉన్నంతకాలం వారికి స్నాక్స్ ను ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరో నెలరోజుల త ర్వాత ఎస్ఎస్సీ పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ప్రత్యేక క్లాసులను నడిపిస్తుంది. ఎండాకాలం దృష్ట్యా ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా విద్యాశాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉల్లంఘిచరాదని తెలిపింది.