జనగామ : జనగామ జిల్లా చిల్పూరులోని గ్రామ శివారులోని ఆకేరు వాగు ఒడ్డున ఓ అరుదైన మొక్క ప్రత్యక్షమైంది. శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద అరుదైన మయూర శిఖ మొక్కను గుర్తించామని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. నెమలి ఈకను పోలి ఉండడం వల్ల మయూర లేదా నీలకంఠ శిఖ మొక్కగా పిలవొచ్చాన్నారు. స్థానికులు వీటిని నెమలి పించం చెట్టు అని అంటారన్నారు.
ఇవి 15 మిల్లీమీటర్ల నుంచి 45 మిల్లీమీటర్ల పొడవు వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ మొక్కతో ఆయుర్వేద పరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయని, చర్మ వ్యా ధులు,అతిసార, పేగులో పురుగులు, మధుమేహ, తదితర వ్యాధులకు ఈ మొక్కను ఉపయోగిస్తారన్నారు. ఈ మొక్క రాతి పగుళ్లల్లో, నీటి ప్రవాహాల అంచున తేమతో ఉన్న రాతి గోడల్లో, చౌడు నేలల్లో పెరుగుతుందని వివరించారు.