‘ఈ దేశంలో చెలామణి అయ్యే ప్రతీ రూపాయిలో తొంభై పైసలు కొందరే సంపాదిస్తారు. మిగతా పది పైసల గురించి అందరూ కొట్టుకుంటారు. సినిమాలో హీరో వాసు ఆ కొందరిలో ఒకడిగా ఉండాలనుకుంటాడు. ఆ కాన్సెప్ట్ ఆధారంగానే ఈ సినిమా తీశాం’ అన్నారు వరుణ్‌తేజ్. ఆయన హీరోగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మట్కా’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం వరుణ్‌తేజ్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..