న్యూఢిల్లీ : సెప్టెంబర్ 14న యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ గ్రాండ్ లాంఛ్ సందర్భంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఐఫోన్ కొనుగోలు చేయదలిచిన వారు తమ బడ్జెట్ రూ 50,000కు మించి లేకుంటే సెప్టెంబర్ 23 నుంచి షురూ కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో డ్రీమ్ ఫోన్‌ను తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాత ఐఫోన్ మోడల్స్‌పై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అందుబాటు ధరలో ఐఫోన్లను దక్కించుకోవచ్చు.
రూ 30,000 బడ్జెట్లో ఐఫోన్ 11 సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. ఐఫోన్ 11 64జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ 43,900కు లిస్టవగా పాత ఫోన్‌పై రూ 19,000 వరకూ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఈకామర్స్ దిగ్గజం అందిస్తోంది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డు యూజర్లు ఈ డివైజ్‌పై అదనంగా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఇక ఐఫోన్ 12 128జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ 64,900కు లిస్టవగా పాత ఫోన్‌ను విక్రయంపై రూ 19,000 వరకూ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డు దారులకు అదనంగా ఐదు శాతం డిస్కౌంట్ లభిస్తుండగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫోన్ ధర మరింత తగ్గవచ్చని భావిస్తున్నారు.
ఇక ఐఫోన్ 14, ఐఫోన్ 13 మధ్య డిజైన్, ఫీచర్ల పరంగా పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో ఐఫోన్ 13 కూడా కస్టమర్లకు క్రేజీ డివైజ్‌గా ఆకట్టుకుంటోంది. ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ 69,990కి లిస్టవగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ రూ 19,000 వరకూ ఆఫర్ చేస్తోంది. మీవద్ద ఐఫోన్ 11 ఉంటే రూ 18,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద సమకూరితే ఐఫోన్ 13 ధర రూ 50,900కు తగ్గుతుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ధర మరింత దిగిరానుంది. ఇక ఐఫోన్ 13 ధర రూ 49,900కు తగ్గుతుందని ఫ్లిప్‌కార్ట్ ఇటీవల టీజర్లో వెల్లడించింది. నిర్ణీత కాలవ్యవధికే ఈ డీల్ పరిమితమవుతుందని చెబుతున్నారు.