Virosh | రానున్న వెడ్డింగ్ సీజన్ కోసం ప్రముఖ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ మాన్యవర్, మోహె ( Manyavar Mohey ) సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ నవ జంట విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda), రష్మిక మందన్నా ( Rashmika Mandanna)తో ఒక క్యాంపెయిన్‌ను రూపొందించింది. ప్రచార్ కమ్యూనికేషన్ క్రియేట్ చేసిన ఈ క్యాంపెయిన్‌కు ఇప్పుడు డిజిటల్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విశేష స్పందన లభిస్తోంది.
ఆధునిక వివాహ వేడుకల భావోద్వేగాలు, ఆనందాన్ని ప్రతిబింబించేలా క్రియేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ కాన్సెప్ట్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్యాంపెన్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే రష్మిక మందన్నాతో విజయదేవరకొండ కలిసి ఉన్న స్టిల్కు ఇన్‌స్టాగ్రామ్‌లో100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 8 మిలియన్ల ఆర్గానిక్ లైక్స్ నమోదయ్యాయి. ఇతర సోషల్‌మీడియా ప్లాట్ఫామ్ల్లో కలిపి ఇప్పటివరకు 300 మిలియన్లకు పైగా వ్యూస్, 250 మిలియన్ల యూజర్లను చేరుకుంది. ఇక పోస్టు ఎంగేజ్మెంట్ విషయానికొస్తే 4 లక్షలకు పైగా షేర్లు, 65 వేల రీపోస్టులు, 29,500కుపైగా కామెంట్లు వచ్చాయి. దీనిపై ప్రచార్ కమ్యూనికేషన్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి డిజిటల్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మాత్రమే ఈ క్యాంపెయిన్ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే సినిమా థియేటర్లు, ప్రింట్, అవుట్ డోర్ మీడియాలకు కూడా విస్తరిస్తామని పేర్కొన్నారు
ఈ సందర్భంగా ప్రచార్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రక్షిత్ జైన్ మాట్లాడుతూ.. కేవలం మూడు రోజుల్లోనే ఇలాంటి క్యాంపెయిన్‌కు ఆలోచన చేసి పూర్తి చేయడం, దానికి విశేష స్పందన రావడంపై హర్షం వ్యక్తం చేశారు. మాన్యవర్తో తమకు దశాబ్దకాలంగా ఉన్న సంబంధం వల్లే ఇంత వేగంగా పూర్తి చేయగలిగామని తెలిపారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు తాము ఊహించిన దానికంటే రెస్పాన్స్ చాలా ఎక్కువగా వచ్చిందని పేర్కొన్నారు.
రష్మి మందన్నా మాట్లాడుతూ.. మాన్యవర్ మోహె బ్రాండ్ వివాహాలను భావోద్వేగాలతో చూపించే విధానం చాలా ప్రత్యేకమని తెలిపారు. ఈ వివాహ కలెక్షన్లోని దుస్తులు అందంగా ఉండటంతో పాటు అద్భుతమైన నైపుణ్యాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక విజయ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ క్యాంపెయిన్ సంబంధాల అసలైన భావాన్ని చూపిస్తుందని అన్నారు. కాన్సెప్ట్, సంగీతం, దుస్తులు అన్ని కలిసి ఆధునికతతో పాటు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.