శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మనుచరిత్ర’. కాజల్ అగర్వాల్ సమర్పణలో నరాల శ్రీనివాసరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలోని ‘కనబడకనే తెగ తిరుగుతూ నన్ను వెతికిన తుమ్సే మేరా ప్యార్ హువా’ అనే వీడియో గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రమ్యబెహరా ఆలపించారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చారు. నిర్మాత మాట్లాడుతూ ‘వరంగల్ బ్యాక్డ్రాప్లో సాగే స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. ఓ ప్రేమికుడి వేదన, బాధ వెనకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు.