Heroine | జనాల మధ్యకి హీరోయిన్స్ వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఎవరు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తారో అని టెన్షన్ పడుతుంటారు. అయిన కొన్ని సార్లు తప్పని పరిస్థితులలో బయటకు రావల్సిన పరిస్థితి. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం చూపిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్. ఈ మలయాళ బ్యూటీ తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లింది.ఆమె వస్తుందని తెలిసి జనం పెద్ద సంఖ్యలో ఆ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత మంజు వారియర్ తిరిగి వెళ్లేందుకు తన కారు దగ్గరకు వచ్చింది.
ఇక ఆ సమయంలో జనాలు తనని చుట్టు ముట్టడంతో వారందరికి అభివాదం చేసింది. కొందరు ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే సందట్లో సడేమియా అన్నట్టు ఓ వ్యక్తి చేత్తో ఆమె నడుమును పట్టుకుని లాగాడు. మంజు వారియర్ పట్టించుకోలేదు. కొంతమందితో సెల్ఫీలు దిగి అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మంజూతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. మంజు వారియర్ అయితే ఇందులో సీరియస్ అయినట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. ఇది అసలు ఎప్పటి వీడియో? మరీ పాతదా? రీసెంట్ వీడియోనా? అన్న విషయం కూడా క్లారిటీ రావడం లేదు.
మంజూ వారియర్ విషయానికి వస్తే.. 1995లో వచ్చిన సాక్ష్యం అనే మలయాళ సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే దిలీప్‌తో ప్రేమలో పడింది. 1998 ఇద్దరికీ పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయింది. అయితే, దిలీప్ మరో హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకోవడంతో వారు విడిపోయారు. ఇక ఆ తర్వాత 2014 నుంచి మంజు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. 2024లో వచ్చిన రజినీకాంత్ ‘వేట్టయాన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంజు వారియర్ రీసెంట్గా ఎల్2 ఎంపురాన్ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
Awful behaviour from the crowd having no sense of boundary or respect towards the actress !#ManjuWarrier pic.twitter.com/6YYEpCDUQu
— Mollywood BoxOffice (@MollywoodBo1) May 2, 2025