Manchu Lakshmi | కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో గొడవలు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం కావడం మనం చూస్తూనే ఉన్నాం.మనోజ్, మోహన్ బాబును పరస్పర దాడులు.. మనోజ్ ఇంట్లో దొంగతనం, మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ధర్నా.. మంచు విష్ణుపై మనోజ్ సంచలన ఆరోపణలు ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు టాలీవుడ్లో దుమారం రేపుతున్నాయి. తన భార్య మౌనిక వచ్చినప్పటి నుండే వారు ఇలా చేస్తున్నారంటూ మనోజ్ ఇటీవల చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఇవి ఉన్నాయి కాని , ఈ మధ్యే ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఈ గొడవలు జరుగుతున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ స్పందించింది లేదు.
ఈ నేపథ్యంలో ఓ ఫంక్షన్లో తమ్ముడు మంచు మనోజ్ ను చూడగానే మంచు లక్ష్మి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మంచు మనోజ్ తన సతీమణితో కలిసి వెళ్లి తన అక్క మంచు లక్ష్మీని సర్ ప్రైజ్ చేశారు. తన సోదరి లక్ష్మీ స్టేజ్ పై ఉండగానే చెప్పకుండా వెళ్లి ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు మంచు మనోజ్. సడెన్ గా మనోజ్ ను చూసిన మంచు లక్ష్మీ..ఆయనను పట్టుకుని కన్నీటి పర్యంతం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అక్క, తమ్ముళ్ల అనుబంధం చూసి నెటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఆ మధ్య మంచు లక్ష్మీ ముంబై నుండి వచ్చి గొడవ చల్లబరిచే ప్రయత్నం చేసిందని, ఆమె మాట ఎవరు వినలేదని టాక్ నడిచింది.
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు.. ఈ గొడవలు చిన్నపాటి యాక్షన్ సినిమాని తలపించాయి. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. చూస్తుంటే ఈ గొడవలు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని హంగామా చేశారు. తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్నారు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా, ఆ సమయంలో మంచు విష్ణు తన కార్లను దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు మనోజ్.. మంచు విష్ణునే ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేయడం, ఈ రచ్చ కొనసాగడం జరుగుతూనే ఉంది.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్ ని ఓ ఫంక్షన్లో చూడగానే కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి,అక్కా తమ్ముళ్ళను ఓదార్చిన మౌనిక…. pic.twitter.com/EJB9J6bMkA
— Swathi Reddy (@Swathireddytdp) April 13, 2025