Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ రాజా సాబ్తో వచ్చి థియేటర్లలో సందడి చేస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినివ్వడంతో పాటు ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చింది.
జనవరి 11న తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ. 600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ప్రీమియర్ షోలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 చొప్పున అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కూడా అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.