Mana Shankara Vara Prasad Garu OTT | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. ఈ సినిమాను ఫిబ్రవరి 11నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
దర్శకుడు అనిల్ రావిపూడి మార్కు కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ తన స్పెషల్ అప్పీరెన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేశారు. ముఖ్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వెర్షన్లో థియేటర్లో కట్ చేసిన కొన్ని చిరంజీవి, VTV గణేష్ కాంబినేషన్ కామెడీ సీన్లను కూడా జత చేయబోతుండటం విశేషం.
The Mega Victory is locked 🔒
February 11
📍 ONLY on #ZEE5#ManaShankarVaraPrasadGaru #ManaShankarVaraPrasadGaruOnZee5 #Chiranjeevi #Teluguzee5 #AnilRavipudi pic.twitter.com/DZVe2cwrwc— ZEE5 Telugu (@ZEE5Telugu) February 7, 2026