Mana Shankara Vara Prasad | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సందడి మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నేటి నుండి అధికారికంగా ప్రారంభమయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం, రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. ప్రారంభం అయిన నిమిషాల్లోనే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లోని థియేటర్లు ‘హౌస్ ఫుల్’ బోర్డులు పెట్టేస్తున్నాయి. మరోవైపు అభిమానుల విన్నపం మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నేటి రాత్రి 8 గంటల నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతినిచ్చాయి. ప్రీమియర్ షో ధర తెలంగాణలో రూ.600గా నిర్ణయించగా.. ఆంధ్రప్రదేశ్లో రూ.500గా నిర్ణయించారు.
NIZAM PREMIERE BOOKINGS ARE NOW OPEN for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
Book your tickets for the BIGGEST FAMILY ENTERTAINER OF SANKRANTHI 2026 🎟️
— https://t.co/PEnJ50eWTWGRAND PREMIERES TODAY 💥#MSG MASSIVE RELEASE WORLDWIDE IN THEATRES ON JANUARY 12, 2026.… pic.twitter.com/b3swR4yAL0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 11, 2026