న్యూఢిల్లీ: రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండటాన్ని ఒక బైకర్ సహించలేకపోయాడు. ఏకంగా బైక్‌ను భుజంపైకి ఎత్తుకున్నాడు. (Man Lifts Bike On His Shoulders) రైలు గేటు పక్క నుంచి వెళ్లి పట్టాలు దాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేసి ఉన్నది. ఆ రైల్వే గేటు కింద నుంచి బైకులు వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఒక వ్యక్తి బైక్‌పై అక్కడకు వచ్చాడు. అయితే రైలు వెళ్లేంత వరకు ఆ గేటు వద్ద వేచి ఉండలేకపోయాడు. తన బైక్‌ను అమాంతం భుజంపైకి ఎత్తాడు. దానిని మోసుకుంటూ గేటు పక్క నుంచి నడిచి వెళ్లాడు. రైలు పట్టాలు దాటిన తర్వాత భుజంపై ఉన్న బైక్‌ను కిందకు దించాడు. ఆ తర్వాత ఆ బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది అన్నది తెలియలేదు.
కాగా, ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బరువైన బైక్‌ను చాలా సులువుగా పైకి ఎత్తి భుజంపై అతడు మోయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఫిట్నెస్ను కొందరు ప్రశంసించారు. జిమ్‌కు వెళ్లే వ్యక్తి అయ్యి ఉంటాడని కొందరు భావించారు.
మరోవైపు ఆ వ్యక్తి తీరుపై మరికొందరు మండిపడ్డారు. రైల్వే ట్రాక్ వద్ద ప్రమాదకరంగా వ్యవహరించిన అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
A guy Lifted his bike on his shoulders to Cross the Railway barrier: pic.twitter.com/ki4dx5BmZZ
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 6, 2025