ప్రియురాలి కొడుకును చంపిన వ్యక్తికి.. యావజ్జీవం
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియురాలి కొడుకును గొంతు నులిమి చంపిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కే శైలజ తీర్పు వెలువరించారు.

వరంగల్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియురాలి కొడుకును గొంతు నులిమి చంపిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కే శైలజ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి శ్రీనివాసరావు కథనం ప్రకారం నిందితుడు ఒరిస్సాకు చెందిన దినసరి కూలీ సమీపంలోని నక్కలపల్లి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఉండేవాడు. తన పొరుగు గ్రామానికి చెందిన సంజు అనే వివాహితతో అతనికి అక్రమ సంబంధం ఉండేది. ఒరిస్సా నుంచి సంజు కుటుంబాన్ని నక్కలపల్లి పిలిపించాడు. తాను పనిచేసే ఇటుక బట్టీలోనే పనికి కుదిర్చాడు.
అక్రమ సంబంధాన్ని సంజు 11 ఏండ్ల కొడుకు పసిగట్టడంతో తమ అక్రమ సంబంధం బాహ్య ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతో నిందితుడు ఆ బాలున్ని గతేడాది జనవరి 12న ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. మరుసటి రోజు విగతజీవిగా ఉన్న బాలుడు దినేశ్ మృతదేహాన్ని కనుగొని ఫిర్యాదు చేయడంతో మామూనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అప్పటి ఇన్స్పెక్టర్ ఎస్.రాజు ఈ కేసులో నిందితున్ని అదుపులోకి తీసుకొని సాక్షాధారాలు సేకరించి చార్జిషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కే శైలజ నిందితుడు నేరం చేశాడని నిర్ధారించి హత్యానేరం కింద యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్ ఎం.చందర్ సాక్షులను ప్రవేశపెట్టినట్లు ఇన్స్పెక్టర్తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

