ఓ వ్యక్తి తన స్నేహితుడి బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. స్టేజీపైన హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొడుతుంటే ఇంకా జోష్‌గా స్టెప్పులేశాడు. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న వైద్యుడు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది.
ప్రభాత్ కుమార్ (48).. బరేలీ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబ్ (ఐవీఆర్ఐ)లో అసిస్టెంట్ టెక్నికల్‌గా పనిచేస్తున్నాడు. ప్రభాత్‌కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రేమ్‌నగర్‌లో జరిగిన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో తన ఇష్టమైన పాటపై స్టెప్పులేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో స్టేజీపైనే పడిపోయాడు. అతిథుల్లో ఒక వైద్యుడు వెంటనే సీపీఆర్ కూడా చేశారు. అయినా, ప్రభాత్‌కుమార్ ప్రాణాలు దక్కలేదు. అతడు పార్టీకి హాజరయ్యే ముందు బ్యాడ్మింటన్ కూడా ఆడాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కళ్లముందే స్నేహితుడు కుప్పకూలిపోవడంతో స్నేహితులంతా విషాదంలో మునిగిపోయారు. ఇది సహజ మరణమే కాబట్టి ఎలాంటి కంప్లైంట్ రాలేదని పోలీసు అధికారులు తెలిపారు.
A man fell on the ground and died while dancing at a birthday party in Bareilly. The incident took place on Thursday night. #Viral #ViralVideo #viraltwitter #viral2022 #UttarPradesh #Bareilly #India pic.twitter.com/VJRbsHqkSh
— Anjali Choudhury (@AnjaliC07) September 3, 2022