తెలుగు యూనివర్సిటీ, జూలై 6: డాక్టర్ సీ నారాయణరెడ్డి విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారం 2026కు ప్రముఖ మలయాళ కవి కే సచ్చిదానందన్ ఎంపికయ్యారు. ఈ మేరకు సుశీలానారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షులు సీ గంగ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచ్చిదానందన్ కవితలు మలయాళంతో పాటు ఇతర 18 భారతీయ భాషల్లో సంపుటాలుగా వెలువడ్డాయని పేర్కొన్నారు.
జూలై 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్ సీ నారాయణరెడ్డి 95వ జయంతి ఉత్సవాల్లో సచ్చిదానందన్ను జ్ఞాపిక, ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదుతో సత్కరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య వెల్లడించారు. త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు.