న్యూఢిల్లీ, జూలై 6: నెస్లే ఎస్ఏ అనుబంధ సంస్థయైన నెస్లే బిజినెస్ సొల్యుషన్స్..హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. జెన్‌ప్యాక్ట్‌తో కలిసి ఈ జీసీసీని నెస్లే బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ నిర్వహించనున్నది. ఈ జీసీసీ కోసం ఎంతమేర పెట్టుబడులు పెట్టే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. హైదరాబాద్‌లోని బలమైన సాంకేతిక వ్యవస్థ, పటిష్ఠమైన మౌలిక సదుపాయాలు, దేశంలో జీసీసీ హబ్‌గా వెలుగొందుతున్న నగరం కూడా కావడంతో ఎంపిక చేశామన్నారు.