Dhanush 55 | తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ సినిమాను (D55) ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వెలుబడింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ధనుష్ మరియు మమ్ముట్టి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దాదాపు ఏడేళ్ల (2019లో వచ్చిన ‘పేరంబు’) తర్వాత మమ్ముట్టి తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి మరియు శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
‘అమరన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ధనుష్ స్వయంగా తన వండర్‌బార్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్‌టేక్ స్టూడియోస్‌తో కలిసి ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాడు.
When the Big M chooses a story, it becomes history 🔥
Super excited to welcome Megastar @mammukka onboard #D55!
We are honoured! Thank you #Mammootty sir.@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @Sai_Pallavi92 @sreeleela14 @SaiAbhyankkar @Shra2309 @azy905… pic.twitter.com/f21kdflsbR
— Wunderbar Films (@wunderbarfilms) February 4, 2026