RajaSekhar | ‘బుల్లెట్ సునీల్’గా రాజశేఖర్ రీ ఎంట్రీ .. ‘బైకర్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌లో జోష్
RajaSekhar | ఒకప్పుడు టాలీవుడ్లో యాక్షన్ హీరోగా, యాంగ్రీ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి హీరోగా కాకుండా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
RajaSekhar | ఒకప్పుడు టాలీవుడ్లో యాక్షన్ హీరోగా, యాంగ్రీ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి హీరోగా కాకుండా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది.ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మంచి అంచనాలు తీసుకురాగా, తాజాగా మేకర్స్ రాజశేఖర్ పాత్రకు సంబంధించిన ‘బుల్లెట్ సునీల్’ గ్లింప్స్ విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌లో రాజశేఖర్‌ను ఓ మాజీ పవర్ఫుల్ బైక్ రేసర్‌గా చూపిస్తూ స్టైలిష్ లుక్, గంభీరమైన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనను ఇంత ఎనర్జిటిక్‌గా, మాస్ షేడ్ ఉన్న పాత్రలో చూడబోతున్నామనే సంకేతాలు ఈ వీడియో ఇచ్చింది.గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. “ఇది రాజశేఖర్‌కు గ్యారెంటీ కంబ్యాక్ మూవీ అవుతుంది” అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన కనిపించడమే సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
శర్వానంద్‌తో పాటు రాజశేఖర్ లాంటి సీనియర్ నటుడు కీలక పాత్రలో కనిపించడం సినిమాకు అదనపు బలం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యూత్‌కు దగ్గరైన బైక్ రేసింగ్ కథతో పాటు అనుభవజ్ఞులైన నటుల ప్రెజెన్స్ ఉండటంతో ‘బైకర్’ మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో రాజశేఖర్ ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ఉంది. ‘బుల్లెట్ సునీల్’ గ్లింప్స్‌తో ఆయన మళ్లీ పవర్ఫుల్ పాత్రలతో అలరించబోతున్నారని సంకేతాలు రావడంతో, ఈ సినిమా ఆయన కెరీర్లో మరో మలుపు తిప్పే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

