మలయాళ భామ మాళవికా మోహనన్‌కు మెగా అవకాశం పలకరించనుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో నాయికగా ఈ సుందరి ఎంపికైనట్లు తెలుస్తోంది. మాళవికా మోహనన్ రజినీకాంత్ నటించిన ‘పెటా’, విజయ్ ‘మాస్టర్’ చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. ‘మాస్టర్’ చిత్రంలో చారులత క్యారెక్టర్ తో ఇక్కడి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది మాళవికా. చిరంజీవి హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారని ఓ నాయికగా మాళవికాను తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం మాళవికా మోహనన్ తమిళంలో ధనుష్ సరసన ‘మారన్’, ‘యుద్ర’ అనే చిత్రాల్లో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమా, మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతోంది.