హైదరాబాద్: ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా టీకా ఆర్టీఎస్, ఎస్ ధరను తగ్గించినట్లు భారత్ బయోటెక్, జీఎస్కే ప్రకటించాయి. మలేరియా తీవ్రంగా ఉన్న దేశాల్లోని బాలలకు దీనిని 5 డాలర్లు (సుమారు రూ.430) కన్నా తక్కువకు అందజేయనున్నట్లు తెలిపాయి. ఈ టీకా ధర తగ్గడం వల్ల ఏటా వేలాది మంది చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. 2026-2030 కాలంలో అమలు చేయడానికి గవి వ్యాక్సిన్ అలయెన్స్‌కు ఈ కంపెనీలు ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గింపు ధరలు క్రమంగా అమల్లోకి వస్తాయి. 2028నాటికి సంపూర్ణంగా అమలవుతాయి.