వరుణ్‌సందేశ్ నటించిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ ఉపశీర్షిక. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కథ, కథనం కూడా ఆయనే. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఓ ఊరి వాతావరణం.. అక్కడ అలముకున్న చీకటి.. గుడిసె.. కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. దుర్మార్గులను అంతం చేసేందుకు ఖడ్గంతో సిద్ధంగా ఉన్న న్యాయదేవత విగ్రహం.. ఇవన్నీ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాయి. ఏదో కథ చెబుతున్నట్టుగా ఈ పోస్టర్ ఉందని పోస్టర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో ఆనీ కథానాయిక. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రమీజ్ నవీత్, సంగీతం: సంతు ఓంకార్.