తరుణ్‌భాస్కర్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మాతలు. పవన్ సాధినేని సమర్పకుడు. మే 1న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని నాలుగో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ప్రేమకి పులిహోర కలిపామా.. పెళ్లికి రూటే వేశామా..’ అంటూ సాగే ఈ పాట మోడరన్ లవ్‌లో ఉండే ఆటుపోటులనూ, సరదాలను ఆవిష్కరిస్తున్నది.
తనకు నచ్చిన అమ్మాయిని ఆకట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులు.. ఇవన్నీ ఈ పాటలో హ్యూమరస్‌గా ఆకట్టుకున్నాయి. స్వీకర్ అగస్తీ స్వరపరచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. తరుణ్‌భాస్కర్, మానస చౌదరిల కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. విష్ణు ఓయి, హర్షవర్దన్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: సూర్య ప్రకాశ్ జోస్యుల, కెమెరా: విద్యాసాగర్ చింతా, నిర్మాణం: సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్.