ప్రేమకి పులిహోర కలిపామా..
తరుణ్‌భాస్కర్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మాతలు.
తరుణ్‌భాస్కర్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మాతలు. పవన్ సాధినేని సమర్పకుడు. మే 1న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని నాలుగో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ప్రేమకి పులిహోర కలిపామా.. పెళ్లికి రూటే వేశామా..’ అంటూ సాగే ఈ పాట మోడరన్ లవ్‌లో ఉండే ఆటుపోటులనూ, సరదాలను ఆవిష్కరిస్తున్నది.
తనకు నచ్చిన అమ్మాయిని ఆకట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులు.. ఇవన్నీ ఈ పాటలో హ్యూమరస్‌గా ఆకట్టుకున్నాయి. స్వీకర్ అగస్తీ స్వరపరచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. తరుణ్‌భాస్కర్, మానస చౌదరిల కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. విష్ణు ఓయి, హర్షవర్దన్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: సూర్య ప్రకాశ్ జోస్యుల, కెమెరా: విద్యాసాగర్ చింతా, నిర్మాణం: సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

