న్యూయార్క్: మేజర్ అభిలాష బరాక్(Major Abhilasha Barak)కు అరుదైన గౌరవం దక్కింది. లెబనాన్‌లో ఐక్యాసమితి శాంతి మిషన్‌లో పాల్గొన్న భారతీయ పీస్‌కీపర్ మేజర్ అభిలాషను యూఎన్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును ఆమెకు ప్రకటించారు. 2025 యునైటెడ్ నేషనల్ మిలిటరీ జెండర్ అడ్వకేడ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నట్లు యూఎన్ భారత విభాగం తెలిపింది. పశ్చిమ ఆసియా దేశాల్లోని మహిళలు, టీనేజీ అమ్మాయిల్లో జెండర్ అంశాల్లో చైతన్యం కలిగించిన నేపథ్యంలో అభిలాషకు ఆ గుర్తింపు వచ్చినట్లు యూఎన్‌లోని ఇండియన్ పర్మినెంట్ మిషన్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది.
లెబనాన్‌లో ఉన్న భారత బెటాలియన్‌లోని ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్‌కు ఆమె కమాండర్‌గా ఉన్నారు. లెబనాన్‌లోని యూఎన్ ఇంటీరియం ఫోర్స్‌లో ఆమె సేవలు అందిస్తున్నది. భారతీయ ఆర్మీకి చెందిన మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్‌గా ఆమెకు రికార్డు ఉన్నది. యూఎన్ పీస్‌కీపర్స్ అంతర్జాయతీ దినోత్సవం సందర్భంగా మే 29వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ఈవెంట్లో అభిలాషను అవార్డుతో సత్కరించనున్నారు. యూఎన్ పీస్‌కీపర్స్ అవార్డు అందుకున్న మూడవ భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. గతంలో మేజర్ సుమన్ గవాని, మేజర్ రాధికా సేన్ కూడా యూఎన్ పీస్‌కీపర్స్ అవార్డు గెలుచుకున్నారు.
మేజర్ సుమన్ గవానీ.. గతంలో దక్షిణ సుడాన్ యూఎన్ మిషన్‌లో సేవలు అందించారు. 2019 యూఎన్ మిలిటరీ జెండర్ అవార్డును ఆమె గెలుచుకున్నారు. ఆమెతో పాటు ఆ సంవత్సరం బ్రెజిల్ నేవీ ఆఫీసర్ కమాండర్ కార్లా మెంటిరియో డీ కాస్ట్రో అరౌజో అవార్డును పంచుకున్నారు. ఇక మేజర్ రాధికా సేన్ .. డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలో పీస్ మిషన్‌లో సేవలు అందించారు.
Proud to announce that Major Abhilasha Barak has been awarded the 2025 @UN Military Gender Advocate of the Year Award.
She is serving with the Indian Battalion as the Commander of the Female Engagement Team (FET) in #UNIFIL. Major Abhilasha is also first woman combat… pic.twitter.com/FcAW3OFZul
— India at UN, NY (@IndiaUNNewYork) May 22, 2026