SSMB28 Movie | మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పరుగులు పెడుతుంది. అటు మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. దానికి తోడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజైన గ్లింప్స్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగబోతుందట. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరగనున్నట్లు సమాచారం. ఈ మేజర్ షెడ్యూల్లో మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీలతో సహా ప్రధాన తారాగణంపై సీన్స్ చిత్రీకరించనున్నారట. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.