SSMB 28 | టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28). త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఎస్ఎస్ఎంబీ 28 (వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతోంది. కాగా ఎప్పుడో షూటింగ్ మొదలై.. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజులకు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది.
ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో షురూ కానుంది. ఇక ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం మే 31న ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ గ్లింప్స్ తోపాటు టైటిల్ కూడా ప్రకటించబోతున్నారట. కొన్నాళ్ల క్రితం ఫస్ట్ లుక్ లాంఛ్ చేసి.. ఫ్యాన్స్ లో జోష్ నింపిన త్రివిక్రమ్ టీం.. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అభిమానులను ఫుల్ ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది.
ఈ చిత్రంలో ముంబై భామ పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా మెరువనుంది. ఎస్ థమన్ ఎస్ఎస్ఎంబీ 28కి సంగీతం అందిస్తున్నాడు. మహేశ్‌బాబుకు దూకుడు, ఆగడు, సర్కారు వారి పాట సినిమాలకు స్టన్నింగ్ ఆల్బమ్స్ అందించిన థమన్ మరోసారి మ్యూజిక్ అందిస్తుండటంతో మ్యూజిక్ లవర్స్ ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎస్ఎస్ఎంబీ 28 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.