
దేవరకద్రరూరల్, నవంబర్ 2: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర పీహెచ్సీలో అన్ని వసతుల తో కూడిన వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.18.50లక్షలతో ని ర్మించిన 10పడకల ఐసీయూ వార్డును మంగళవారం ఎమ్మె ల్యే ఆల కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. ముం దుగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో దాతల సహకారంతో దేవరకద్ర పీహెచ్సీలో ఐసీయూ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్మాణ్ సంస్థకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. పీహెచ్సీలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని సంస్థ ఎండీ వహీద్‌ను కోరారు. దేవరకద్ర పీహెచ్‌సీని ఆధునీకరించడంతో ఐదు మండలాల ప్రజలకు వైద్యసేవలు అందుతాయని, పూర్తి సౌకర్యాలతో 24 గంటలపాటు సేవలు కొనసాగించేందుకు ఇద్దరు డాక్టర్ల ను, ఏఎన్ఎంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కరోనా సమయం లో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు రోగులను తీసుకెళ్లేందుకు ఎదురైన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని నిర్మాణ్ సంస్థతో మాట్లాడి రూ.30లక్షల యంత్ర పరికరాలు ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవ తో ఐసీయూ భవన నిర్మాణానికి రూ.18లక్షలు, మొత్తం దా దాపుగా రూ.50లక్షల నిధులతో ఐసీయూ వార్డును ఏర్పా టు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈ వో వహిద్ దిశ సంస్థ సహకారంతో పీహెచ్‌సీకి 10పడకల ఐసీయూ వార్డుతో పాటు 25 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారని, నెలరోజుల్లో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, నిర్మాణ్ సంస్థ ఆర్గనైజర్ ఉమ, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, ఆర్డీవో ప ద్మశ్రీ, తాసిల్దార్ జ్యోతి, ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, సర్పంచ్ విజయలక్ష్మి, మాజీ ఎం పీపీ ఈవీ గోపాల్, మండల వైద్యాధికారి షబానాబేగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
భూత్పూర్, నవంబర్ 2: ఆపదలో ఉన్న పేదలకు సీఎం స హాయనిధి వరం లాంటిదని ఎమ్మెల్యే ఆల అన్నారు. మండలంలోని అన్నాసాగర్‌లో మంగళవారం ఎమ్మెల్యే రావులపల్లికి చెందిన లక్ష్మమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.40వేల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులుశ్రీనివాసులు, ఉపసర్పంచ్ శ్రీశైలం, గ్రామస్తు లు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు
అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆల సమక్షంలో చిన్నచింతకుంట మండలకేంద్రంలోని 2వ వార్డు బీజేపీ సభ్యుడు దశరథ్‌తో పాటు మరో 10మంది మంగళవారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.