Lok Sabha : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లుకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత (Health Security Se National Security)కు సంబంధించిన కీలక బిల్లు 2025 ముజువాణీ ఓటుతో పాసైంది. ప్రజారోగ్యానికి ప్రతిబంధకంగా మారిన పాన్ మసాలాలపై కొత్త సెస్సు కు ఆమోదం లభించింది. ఈ సెస్సు ద్వారా వచ్చిన ఆదాయాన్ని రక్షణ శాఖకు కేటాయిస్తామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. చర్చలో పాల్గొన్న సభ్యులకు అభినందనలు తెలిపిన ఆమె పాన్ మసాలాపై వచ్చిన పన్నులును భద్రతకు ఉపయోగించడానికి గల కారణాలను వెల్లడించారు.
ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత బిల్లు-2025పై చర్చ సందర్భంగా పాన్ మసాలాపై విధించిన సెస్సును రక్షణ బడ్జెట్‌కే కేటాయించడం ఏంటీ? అని కొందరు సభ్యులు ప్రశ్నించారు. వారి సవాల్‌కు నిర్మలా సీతారామ్ సభలోని ఏ ఒక్కరూ పాన్ మసాలా ఉత్పత్తులపై తక్కువ పన్ను ఉండాలని కోరుకోవడం లేదు. డబ్బును ఏ పనికోసమైనా ఖర్చు చేయొచ్చు. కానీ, ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనేదానికి సరైన విధానం ఉండాలి అని బదులిచ్చారు.
There was a concern raised that how will there be a reduction in the consumption of the commodity.
Once the GST Compensation Cess comes to an end, the effective tax incidence on pan masala, which is currently about 88% – 28% GST plus 60% Compensation Cess – would fall sharply.… pic.twitter.com/cQNGPacCBu
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) December 5, 2025
‘ప్రజారోగ్యం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. రక్షణ అనేది కేంద్రం జాబితాలోనిది. ప్రస్తుత రోజుల్లో సమర్ధమైన రక్షణ సదుపాయాలు ఉండడం చాలా అవసరం. అందుకని ఆదాయ వనరులను పెంచుకోవాల్సి ఉంది. ఆనారోగ్యానికి కారణమయ్యే పాన్ మసాలా వంటివి తక్కువ ధరకే లభించకుండా చూడానేది మా లక్ష్యం’ అని చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. పాన్ మసాలా ఉత్పత్తుల వాడకంను బట్టి వాటిపై జీఎస్టీ కింద 40 శాతం పన్ను విధిస్తామని, ఈ సెస్ ప్రభావం జీఎస్టీ రాబడిపై ఏమాత్రం ఉండదని ఆర్ధిక మంత్రి చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 6.1 శాతంగా ఉందని.. 2010-14లో ఈ శాతం 7గా ఉందనే విషయాన్ని మంత్రి సభకు నివేదించారు.