ఇబ్రహీంపట్నం, మార్చి 24: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న ఘటన బయటపడింది. మంచాల మండలంలోని ఆగాపల్లి వద్ద స్థానికులు అప్రమత్తమై వ్యహరించి సుమారు 15 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు.
ఆవుల కాళ్లు కట్టిపడేసి, గుట్టుచప్పుడు కాకుండా వాటిని తరలించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పశువుల అక్రమ రవాణాపై వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.