అనంత విశ్వాన్ని నిబ్బరంగా చూస్తాను
అంత అర్థం అయినట్టే కట్టిపడేస్తుంది
జీవితం కూడా.
ఆకర్షణతో కట్టుబడ్డట్టు
ముడిపడటాలు చెదిరిపోవటాలు చూస్తాం
కాలం పైన చిరునవ్వుతాకి
కాసేపు చేసే కాలక్షేపం చూస్తాం
మరుక్షణం
గాలికి కాలం ఊగి
పెట్టే కన్నీటిని చూస్తాం
మురిసిపోయే లోపే
తుపాను ముసిరినట్లు
అంతలోనే స్వచ్ఛంగా
దృశ్యాలుగా చెక్కబడుతున్నట్లు
అనుభవాలు కుదుపుతుంటాయి.
తీరంవైపు కళ్లను పరచి
అలల కెరటాలను చూస్తాను
సంతోషాలు దుఃఖాలు పోటీపడి
ఊగిపోతుంటాయి
అయినా నిశ్చలంగా
సముద్రంవైపు చూస్తూ
ప్రశాంతతను పల్లవిస్తాను.
గవిడి శ్రీనివాస్
70192 78368