Lionel Messi | ఫుట్‌బాల్ దిగ్గజం డెవిడ్ బెక్‌హమ్ క్లబ్‌కు ఆడనున్న మెస్సీ..!
Lionel Messi : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్‌ను వీడిన సంగతి తెలిసిందే. దాంతో, అతను వచ్చే సీజన్లో ఏ క్లబ్‌తో ఒప్పందం చేసుకోనున్నాడు? అనే చర్చలు జోరందుకున్నాయి. తాజాగా మెస్సీ కాంట్రాక్ట్ గురించి మరో న్యూస్ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు...
Lionel Messi : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi) పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్‌ను వీడిన సంగతి తెలిసిందే. దాంతో, అతను వచ్చే సీజన్లో ఏ క్లబ్‌తో ఒప్పందం చేసుకోనున్నాడు? అనే చర్చలు జోరందుకున్నాయి. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al-Hilal) క్లబ్ మెస్సీని సంప్రదించిందని, అతను తిరిగి బార్సిలోనా(Barcelona)కు ఆడతాడనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మెస్సీ కాంట్రాక్ట్ గురించి మరో న్యూస్ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు ఈ అర్జెంటీనా కెప్టెన్ ఆడనున్నాడట.
ఈ క్లబ్ సహ యజమాని ఎవరో తెలుసా..? ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డెవిడ్ బెక్‌హమ్(David Beckham). దాంతో, కాంట్రాక్టు విలువ భారీగానే ఉండనుంది. అంతేకాదు అడిడాస్, యాపిల్ వంటి కంపెనీలతో మెస్సీకి ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉంది. అయితే.. అతడు మాత్రం మియామి క్లబ్‌కు ఆడడంపై ఇప్పటివరకు స్పందించలేదు. మరొక విషయం ఏంటంటే..? మెస్సీకి మియామిలో సొంతిల్లు ఉంది. ప్రస్తుతం దానిని అద్దెకు ఇచ్చాడు.
పీఎస్జీ జెర్సీతో మెస్సీ

మెస్సీ తప్పుకోవడంతో..
పీఎస్జీ తరఫున మెస్సీ జూన్ 3 శనివారం ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. క్లెర్మంట్ ఫుట్(Clermont Foot) క్లబ్‌తో మెస్సీ పీఎస్జీ జెర్సీతో చివరిసారి బరిలోకి దిగాడు. అయితే.. ఈ స్టార్ ఆటగాడు పోతూ పోతూ ఆ క్లబ్‌ను దెబ్బ కొట్టాడు. ఎలాగంటే.. మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఆ క్లబ్‌ను వీడారు. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్జీ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లు(6.9 కోట్లు). ప్రస్తుతం ఆ సంఖ్య 68.5 మిలియన్ల(6.8కోట్లు)కి చేరింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మెస్సీ గత ఏడాది ఖతర్‌లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించాడు. ఉత్కంఠ రేపిన ఫైనల్లో 4-2తో షూటౌట్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలుపొందింది. దాంతో మూడోసారి చాంపియన్‌గా అవతరించింది.
ఇవి కూడా చదవండి
WTC Final 2023 | సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్.. భారీ స్కోర్ దిశగా ఆసీస్
Prasidh Krishna | ప్రేయసితో రాజస్థాన్ స్టార్ పేసర్ నిశ్చితార్థం.. ఆమె ఎవరో తెలుసా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

